గుజరాత్ టైటన్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ అదరగొడుతున్నాడు. 16వ ఓవర్ ఐదో బంతికే ప్రమాదకర డేవిడ్ మిల్లర్ (17)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో గుజరాత్ జట్టు 139 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. ఇప్పటి వరకు గుజరాత్ కోల్పోయిన ఐదు వికెట్లూ ఉమ్రాన్ మాలిక్ తీసినవే కావడం గమనార్హం.
మాలిక్ వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు మిల్లర్ ప్రయత్నించాడు. కానీ పూర్తిగా టైమింగ్ మిస్ అవడంతో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత ఒక వైడ్ వేసిన ఉమ్రాన్.. మరుసటి బంతికే అభినవ్ మనోహర్ (0)ను డకౌట్ చేశాడు. దీంతో ఉమ్రాన్ ఈ మ్యాచ్లో తొలిసారి ఐదు వికెట్లు తీసిన ఘనత అందుకున్నాడు.
Maiden 5-wicket haul for the youngster.
Take a bow, Umran Malik.
Live – https://t.co/TTOg8b6LG3 #GTvSRH #TATAIPL https://t.co/ke9nbpJewG
— IndianPremierLeague (@IPL) April 27, 2022