గుజరాత్ టైటన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను మహమ్మద్ షమీ దెబ్బతీశాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (5)ను స్వల్పస్కోరుకే పెవిలియన్ చేర్చిన అతను.. ఆ తర్వాత కాసేపటికే ఫామ్‌లో ఉన్న రాహుల్ త్రిపాఠీ (16)ని కూడా అవుట్ చేశాడు. ఐదో ఓవర్ చివరి బంతిని డిఫెండ్ చేయడానికి త్రిపాఠీ ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి అతని ప్యాడ్లను తాకింది.
హార్దిక్ రివ్యూ కోరగా.. బంతి బ్యాటును తాకలేదని తేలింది. దాంతో త్రిపాఠీ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాతి అల్జారీ జోసెఫ్ వేసిన ఆరో ఓవర్లో తొలి రెండు బంతులకు అభిషేక్ శర్మ రెండు బౌండరీలు బాదాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి సన్‌రైజర్స్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది.