గుజరాత్ టైటన్స్‌పై అద్భుతంగా రాణించిన యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (65) అవుటయ్యాడు. అల్జారీ జోసెఫ్ వేసిన 16వ ఓవర్ తొలి బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. జోసెఫ్ వేసిన స్లోవర్ బాల్‌ను అంచనా వేయలేకపోయిన అతను.. టైమింగ్ మిస్ అయ్యాడు. దాంతో ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి వికెట్లను కూల్చింది. అభిషేక్ ఇన్నింగ్స్ దీంతో ముగిసింది.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ (3) మరోసారి నిరాశపరిచాడు. మహమ్మద్ షమీ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. లాంగాన్ వైపు అతను ఆడిన షాట్ సరిగా కనెక్ట్ కాకపోవడంతో.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న శుభ్‌మన్ గిల్‌కు సులభమైన క్యాచ్ దక్కింది. దీంతో సన్‌రైజర్స్ నాలుగో వికెట్ కోల్పోయింది.