గుజరాత్ టైటన్స్‌పై జరుగుతున్నమ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు అదరగొట్టారు. అభిషేక్ శర్మ (65), ఎయిడెన్ మార్క్రమ్ (56) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. వీళ్లకుతోడు చివరి ఓవర్లు శశాంక్ సింగ్ (6 బంతుల్లో 25 నాటౌట్) ధనాధన్ బ్యాటింగ్‌తో జట్టుకు భారీ స్కోరు అందించాడు. లోకీ ఫెర్గూసన్ వేసిన చివరి ఓవర్లో శశాంక్ దెబ్బకు ఏకంగా 25 పరుగులు వచ్చాయి.
దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ జట్టు 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. హైదరాబాద్ వద్ద ఉన్న బౌలింగ్ బలానికి ఈ లక్ష్యాన్ని కాపాడుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ను మహమ్మద్ షమీ (3/39) గట్టి దెబ్బ కొట్టాడు.
కెప్టెన్ కేన్ విలియమ్సన్ (5), రాహుల్ త్రిపాఠీ (16), నికోలస్ పూరన్ (3) వికెట్లు తీశాడు. వాషింగ్టన్ సుందర్ (3) రనౌట్ అయ్యాడు. అయితే చివర్లో శశాంక్ సింగ్‌తోపాటు మార్కో జాన్సెన్ (8 నాటౌట్) కూడా ఒక సిక్సర్ బాదాడు. గుజరాత్ బౌలర్లలో షమీ మూడు వికెట్లతో చెలరేగగా.. యష్ దయాళ్, అల్జారీ జోసెఫ్ చెరో వికెట్ తీసుకున్నారు.
Innings Break!
Incredible batting this by @SunRisers as they put up a total of 195/6 on the board.
Scorecard – https://t.co/TTOg8b6LG3 #GTvSRH #TATAIPL pic.twitter.com/ZeiUzzqQlA
— IndianPremierLeague (@IPL) April 27, 2022