సన్‌రైజర్స్ బౌలింగ్‌ను వెటరన్ బ్యాటర్ వృద్ధిమాన్ సాహా (39 నాటౌట్) తుత్తునియలు చేస్తున్నాడు. బంతి అందుకున్న ప్రతి బౌలర్‌కూ చుక్కలు చూపించాడు. కేవలం 18 బంతుల్లోనే 39 పరుగులు చేశాడు. 200 పైగా స్ట్రైక్ రేట్‌తో అతను దంచికొడుతుండటంతో.. సన్‌రైజర్స్ బౌలర్స్ ఏమీ చేయలేక చేతులెత్తేశారు.
దీంతో గుజరాత్ జట్టు పవర్‌ప్లే ముగిసే సరికి వికెట్లేమీ నష్టపోకుండా 59 పరుగులు చేసింది. అంతకుముందు బ్యాటర్లు తమ బాధ్యత నిర్వర్తించడంతో సన్‌రైజర్స్ జట్టు 195 పరుగుల భారీ స్కోరు చేసిన సంగతి తెలిసిందే. బౌలర్లు గాడిలో పడకపోతే మ్యాచ్ ప్రమాదంలో పడే అవకాశం కనిపిస్తోంది.