ఈ సీజన్లో తమకు ఎదురైన ఏకైక ఓటమికి గుజరాత్ టైటన్స్ ప్రతీకారం తీర్చుకుంది. తమను ఓడించిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. చివరి ఓవర్లో 22 పరుగులు చేయాల్సిన స్థితిలో.. రషీద్ ఖాన్ (11 బంతుల్లో 31 నాటౌట్) మూడు సిక్సర్లు బాది జట్టుకు విజయాన్ని అందించాడు. సన్‌రైజర్స్ బౌలర్లో ఉమ్రాన్ మాలిక్ మినహా ఎవరూ వికెట్లు తీయలేకపోయారు.
మాలిక్ ఒక్కడే ఐదు వికెట్లతో సత్తా చాటాడు. కానీ మిగతా బౌలర్లు విఫలం అవడంతో గుజరాత్ జట్టు 5 వికెట్ల తేడాతో ఆఖరి బంతికి విజయం సాధించింది. భారీ లక్ష్యంతో బరిలో దిగిన గుజరాత్‌కు వృద్ధి మాన్ సాహా (68) శుభారంభం అందించాడు. శుభ్‌మన్ గిల్ (22) ఫర్వాలేదనిపించగా.. హార్దిక్ పాండ్యా (10), డేవిడ్ మిల్లర్ (17), అభినవ్ మనోహర్ (0) విఫలమయ్యారు.
అయితే రాహుల్ తెవాటియా (21 బంతుల్లో 40 నాటౌట్), రషీద్ ఖాన్ కలిసి గుజరాత్‌ను గట్టెక్కించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ ఒక్కడే ఐదు వికెట్లతో సత్తా చాటాడు. మిగతా బౌలర్లు వికెట్లు లేకుండానే మ్యాచ్ ముగించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 199 పరుగులు చేసిన గుజరాత్.. జయభేరి మోగించింది.