గుజరాత్ టైటన్స్ మరో కీలక వికెట్ కోల్పోయింది. బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో శుభారంభం అందించిన ఇద్దరుఓపెనర్లు సాహా (29), గిల్ (31) వెంట వెంటనే అవుటవడంతో ఆ జట్టు కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో జట్టును ఆదుకుంటాడని అనుకున్న కెప్టెన్ హార్దిక్ పాండ్యా (3) నిరాశపరిచాడు.
షాబాజ్ అహ్మద్ వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన పాండ్యా.. లాంగాన్‌లో లోమ్రోర్‌కు సులభమైన క్యాచ్ ఇచ్చాడు. దీంతో గుజరాత్ జట్టు 78 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. హార్దిక్ నిష్క్రమించడంతో డేవిడ్ మిల్లర్ క్రీజులోకి వచ్చాడు.