Graham Thorpe’s Widow : ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రాహమ్ థోర్ఫ్(Graham Thorpe) ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. నిరుడు రైల్వే ట్రాక్‌పై నిల్చొని యాక్సిడెంట్లో ప్రాణాలొదిన థోర్ప్ గురించి అతడి భార్య అమంద (Amanda) సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (Englanda Cricket Board) స్పందించి ఉంటే తన భర్త ఈరోజు కూడా ప్రాణాలతో ఉండేవాడని ఆమె అంటోంది.
ఇంగ్లండ్ జట్టుకు గిఫ్టెడ్ బ్యాటర్ అయిన థోర్ప్.. 2009లో అసిస్టెంట్ కోచ్‌గా నియమితులయ్యాడు. ఇంగ్లిష్ ఆటగాళ్లకు బ్యాటింగ్ మెలకువలు నేర్పిన ఆయనను యాషెస్ సిరీస్‌లో ఓటమి తర్వాత తప్పించారు. ఆసీస్ పర్యటనలో అదీ కరోనా ఆంక్షల వేళ.. ఒక పోలీస్తో థోర్ప్ జోక్ చేసిన ఒక వీడియో బయటకొచ్చింది. ఆ వీడియోపై ఆగ్రహించిన ఈసీబీ విచారణ చేపట్టి.. ఆయనపై వేటు వేసింది. ఊహించని పరిణామంతో థోర్ప్ కంగుతిన్నాడు. జీవితమంతా ఆటకే అంకితం చేసిన అతడు మానసికంగా చాలా డిస్ట్రబ్ అయ్యాడు. ఆ తర్వత రెండున్నరేళ్లకు అతడు సూసైడ్ చేసుకున్నాడు.
‘If he’d had just a bit more of a support framework to lean on … it would have made all the difference’
Read more from Thorpe’s wife Amanda ⬇️https://t.co/msvrvYAkPB pic.twitter.com/CulJtjZcY3
— Telegraph Cricket (@TeleCricket) November 25, 2025
ఈ విషయంపై టాల్క్ స్పోర్ట్స్‌లో అతడి భార్య ఆమంద మాట్లాడుతూ.. ‘మాకు ఇంగ్లండ్ బోర్డు సకాలంలో సాయం చేసి ఉంటే నా భర్త ఈరోజు కూడా బతికే ఉండేవాడు. ఒత్తిడి కారణంగానే మాఆయన ప్రాణాలు కోల్పోయాడు. మేము ఆదుకోవాలని బోర్డును అడిగాం. కానీ, చాలా ఆలస్యంగా స్పందించింది బోర్డు. అప్పటికే థోర్ప్ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిన్నది. అప్పుడే అతడికి స్ట్రోక్ వచ్చింది. అది అతడి మెదడును ఎంతలా ప్రభావం చేసిందో తెలియదు. అయితే.. థోర్ప్ చాలా అనారోగ్యంతో ఉన్నాడనే విషయం ఈసీబీకి తెలియదు. కానీ.. డాక్టర్లకు నా భర్త పరిస్థితి తెలుసు’ అని ఆయంద వివరించింది.
It is with great sadness that we share the news that Graham Thorpe, MBE, has passed away.
There seem to be no appropriate words to describe the deep shock we feel at Graham’s death. pic.twitter.com/VMXqxVJJCh
— England and Wales Cricket Board (@ECB_cricket) August 5, 2024
తన భర్త థోర్ప్ మానసిక ఒత్తిడి కారణంగానే సూసైడ్ చేసుకున్నాడని ఆమంద చెబుతోంది. ‘థోర్ఫ్ను ఎంతో ప్రేమించే భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆయనకు మేమంటే ఇష్టమే. థోర్ప్ 2022లోనే ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కానీ, మేమంతా ఆయన్ను కాపాడుకున్నాం. ఆ తర్వాత ఆయన మానసిక ఒత్తిడికి గురయ్యాడు. మేము ఆయన్ను డిప్రెషన్ నుంచి బయటపడేసేందుకు ఎన్నో విధాలా ప్రయత్నించాం. కానీ, ఆయన ఒత్తిడిని జయించలేకపోయాడు. గత కొంతకాలంగా థోర్ప్ ఆరోగ్యం సరిగ్గా లేదు. దాంతో, ఆయన తాను లేకుంటే కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారని అనుకున్నాడు. అందుకనే సూసైడ్ చేసుకున్నాడు’ అని అమంద చెప్పుకొచ్చింది.
Waking up to the truly dreadful news of the death of Graham Thorpe, at the age of 55. A brilliant batsman who dug us out of many a hole, but more importantly a person who always embraced the fun after a tough day on the field of play.
These are my pics of him from the 94/95 tour pic.twitter.com/DOBpSPKyBP— Adam C (@Streaky94) August 5, 2024
థోర్ప్ 1993 నుంచి 2005 మధ్య ఇంగ్లండ్ తరఫున ఆడాడు వంద టెస్టులు, 82 వన్డేలలో ప్రాతినిథ్యం వహించాడు. టెస్టులలో 44.66 సగటుతో 6,774 పరుగులు చేయగా వన్డేలలో 2,830 రన్స్ సాధించారు. రిటైర్మెంట్ ప్రకటించాక ఇంగ్లండ్ అసిస్టెంట్ కోచ్‌గా.. ఆ తర్వాత అఫ్గానిస్థాన్ జట్టుకు హెడ్‌కోచ్‌గా పనిచేశాడు థోర్ప్. అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో చివరిదైన ఐదో టెస్టుకు వేదికైన ఓవల్ మైదానంలో థోర్ప్‌ను స్మరించుకుంది ఈసీబీ. ఆట రెండో రోజును పూర్తిగా ఈ దిగ్గజ ఆటగాడికి అంకితం చేసింది. రెండో రోజు మ్యాచ్‌కు ముందు థోర్ఫ్ జీవితాన్ని, క్రికెటర్‌గా అతడి ప్రయాణాన్ని నిర్వాహకులు ప్రత్యేకంగా ప్రస్తావించారు.