MI vs UPW : యూపీవారియర్స్ మరో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న గ్రేస్ హ్యారిస్(39) ఔటయ్యింది. దాంతో, 105 పరుగుల వద్ద యూపీ ఐదో వికెట్ పడింది. అమేలియా కేర్ ఓవర్లో రెండు బౌండరీలు కొట్టిన హ్యారిస్ మూడో బంతికి భారీ షాట్ ఆడింది. లాంగాఫ్‌లో వాంగ్ సూపర్ క్యాచ్ పట్టడంతో హ్యారిస్ వెనుదిరిగింది. దీప్తి శర్మ(5), , సోఫీ ఎక్లెస్టోన్ క్రీజులో ఉన్నారు. యూపీ విజయానికి 26 బంతుల్లో 23 రన్స్ కావాలి. ఐదో వికెట్‌కు విలువైన రన్స్ జోడించారు. తహ్లియా మెక్‌గ్రాత్ (38)ను అమేలియా కేర్ గూగ్లీతో బోల్తా కొట్టించింది. దాంతో, 71 రన్స్ వద్ద యూపీ నాలుగో వికెట్ పడింది. మెక్‌గ్రాత్, హ్యారిస్ నాలుగో వికెట్‌కు 46 రన్స్ జోడించారు. అమనజోత్ ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు కొట్టింది.