రాజ్యసభ్య ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో భారత మాజీ క్రికెటర్, ఎంపీ గౌతం గంభీర్ పాల్గొన్నాడు. శనివారం తన నివాస ప్రాంగణంలోని వివేకానంద పార్క్‌లో గంభీర్ మొక్క నాటాడు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ ట్విట్టర్ వేదికగా గంభీర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ‘గ్రీన్ చాలెంజ్‌లో మీలాంటి ప్రముఖ వ్యక్తులు పాల్గొనడం దేశం, ప్రపంచంలో ఎందరికో స్ఫూర్తిదాయకం. పర్యావరణం పట్ల ప్రేరణ కల్గించే మీ మాటలకు ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు