Gopichand | హైదరాబాద్, ఆట ప్రతినిధి: పారిస్ పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన దీప్తి జివాంజీ, నితీశ్‌కుమార్, రజితను జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ప్రత్యేకంగా అభినందించారు. సోమవారం సాయ్ బ్యాడ్మింటన్ అకాడమీలో పారా అథ్లెట్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ ‘విశ్వక్రీడా వేదికపై పారా అథ్లెట్లు పతకాలతో సత్తాచాటి దేశానికి గర్వకారణంగా నిలిచారు. సాధారణ అథ్లెట్లకు తాము ఏమీ తీసిపోమని వారు చేతల్లో చూపెట్టారు. ప్రతిష్ఠాత్మక టోర్నీలో రాణించడం కోసం వారు ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. భవిష్యత్‌లో మీరు మరిన్ని విజయాలు సాధించాలి’ అని అన్నారు.