Most Searched Icons: పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. ఇదివరకే తన పేరిట లెక్కలేనన్ని రికార్డులు లిఖించుకున్న ఈ బ్యాటింగ్ మ్యాస్ట్రో.. సోషల్ మీడియాలో కూడా కింగ్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. గడిచిన దశాబ్దకాలంగా క్రికెట్‌కు సేవలందిస్తూ కోట్లాది అభిమానులను దక్కించుకున్న కోహ్లీ.. గత 25 ఏండ్లలో గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో నెటిజన్లు వెతికిన టాప్ ఐకాన్స్ లిస్ట్‌లో కూడా చోటు సంపాదించుకున్నాడు. ప్రముఖ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో, నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) లెజెండ్ లెబ్రొన్ జేమ్స్ తర్వాత క్రికెట్లో అత్యధిక మంది వెతికిన క్రికెటర్‌గా అతడు రికార్డులకెక్కాడు.
గూగుల్ సెర్చ్ ఇంజిన్ సేవలు మొదలై ఈ ఏడాదికి పాతికేళ్లు పూర్తైన సందర్భంగా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆ సంస్థ ప్రత్యేకమైన వీడియోను షేర్ చేసింది. ఈ 25 ఏండ్లలో ఇంటర్నెట్ రూపాంతరం చెందిన జర్నీని ఈ వీడియోలో చూడొచ్చు. ఈ పాతికేండ్ల కాలంలో గూగుల్‌లో అత్యధికులు వెతికిన (ఒక్కో విభాగం వారీగా) అంశాన్ని షేర్ చేసింది. ఇందులో ఫుట్‌బాల్‌ను ‘మోస్ట్ సెర్చ్డ్ స్పోర్ట్’గా పేర్కొన్న గూగుల్ క్రిస్టియానో రొనాల్డోను మోస్ట్ సెర్చ్డ్ అథ్లెట్ గా తెలిపింది. క్రికెటర్ల జాబితాలో విరాట్ కోహ్లీని పేర్కొంది. ఈ పాతికేండ్లలో క్రికెట్ నుంచి కోహ్లీ పేరు ఒక్కటే ఉండటం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. జమైకన్ చిరుత ఉసేన్ బోల్ట్.. వంద మీటర్ల పరుగు పందెంలో నెలకొల్పిన 9.58 సెకన్ల రికార్డు మోస్ట్ సెర్చ్డ్ రికార్డుగా నిలిచింది. నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (ఎన్ఎఫ్ఎల్) దిగ్గజం టామ్ బ్రాడీ ‘మోస్ట్ సెర్చ్డ్ గోట్’ జాబితాలో పేర్కొంది.
From superstars to local heroes, here’s to the icons the world searched for most in the last 25 years. #YearInSearch pic.twitter.com/ccpQryIqRO
— Google (@Google) December 13, 2023