బెంగళూరు: సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) ఫ్యాన్స్‌కు శుభవార్త. స్టార్ ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్‌రెడ్డి పూర్తి ఫిట్నెస్ సాధించాడు. గత జనవరి నుంచి పక్కటెముకల గాయం నుంచి బాధపడుతున్న నితీశ్ అన్ని ఫిట్నెస్ పరీక్షలు పాసయ్యాడు. ఇన్ని రోజులు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందిన నితీశ్..అక్కడి ఫిజియోలు జరిపిన యోయో టెస్టుతో పాటు పలు టెస్టులను పూర్తి చేశాడు. దీంతో రానున్న ఐపీఎల్ సీజన్లో ఈ యువ ఆల్‌రౌండర్ ఆడేందుకు లైన్‌క్లియర్ అయ్యింది.
త్వరలో నితీశ్..ఎస్ఆర్హెచ్తో కలిసే అవకాశముంది. గత సీజన్లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటిన ఈ తెలుగు క్రికెటర్ 13 మ్యాచ్‌ల్లో 303 పరుగులు సాధించాడు. దీంతో వేలంలో 6 కోట్లకు ఎస్ఆర్హెచ్ తిరిగి దక్కించుకున్న సంగతి తెలిసిందే. సన్‌రైజర్స్ తమ తొలి మ్యాచ్‌లో ఈనెల 23న రాజస్థాన్ రాయల్స్‌తో తలపడుతుంది.