బెంగళూరు: ఐపీఎల్లో ఇంతవరకూ ఒక్క ట్రోఫీ నెగ్గకపోయినా క్రేజ్ విషయంలో మాత్రం అగ్రశ్రేణి జట్లతో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు శుభవార్త. 2025 సీజన్లో ఆ జట్టును నడిపించేదెవరో గురువారం తేలనుంది.
నేడు ఉదయం 11:30 గంటలకు ఆర్సీబీ.. కెప్టెన్ పేరును అధికారికంగా ప్రకటించనుంది. గత మూడు సీజన్ల పాటు ఫాఫ్ డుప్లెసిస్ సారథ్య బాధ్యతలు మోసాడు. కెప్టెన్సీ రేసులో విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉన్నాడు. గతంలో కోహ్లీ.. ఆర్సీబీని 2013 నుంచి 2021 సీజన్ దాకా సారథిగా వ్యవహరించాడు.