e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 26, 2021
Home News Mira bhai chanu |మీరాబాయి చాను చెవి రింగుల కథ తెలుసా.. తల్లి కష్టం వృథా పోలేదు

Mira bhai chanu |మీరాబాయి చాను చెవి రింగుల కథ తెలుసా.. తల్లి కష్టం వృథా పోలేదు

Mira bhai chanu |ఆ అమ్మాయి అద్భుతాన్ని సాధించింది ! కొండ‌కోన‌ల్లో పుట్టి పెరిగి.. క‌డుపు నింపుకోవ‌డానికి క‌ట్టెలు మోసిన ఆ 26 ఏళ్ల యువ‌తి చ‌రిత్ర సృష్టించింది ! దాదాపు 21 ఏళ్ల త‌ర్వాత‌ ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భార‌త్‌కు మెడ‌ల్ సాధించి పెట్టింది మ‌ణిపూర్‌కు చెందిన మీరాబాయి చాను. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో మ‌న తెలుగు తేజం క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి కాంస్య ప‌త‌కం గెల‌వ‌గా.. ఇప్పుడు మీరాబాయ్ ర‌జ‌త‌ ప‌త‌కంతో మెరిసింది. మెడ‌ల్ గెలిచిన స‌మ‌యంలో చాను క‌ళ్ల‌లో మెరిసిన ఆనందం చూప‌రుల‌ను ఆక‌ట్టుకుంది. అదే స‌మ‌యంలో మ‌రొక విష‌యం కూడా అంద‌ర్నీ విశేషంగా ఆక‌ర్షించింది. అవే ఆమె చెవి రింగులు. అవి అచ్చం ఒలింపిక్ రింగ్స్‌ను పోలి ఉండ‌టంతో అస‌లు అవేంటి? ఆ చెవి రింగుల వెనుక ఉన్న క‌థేంటని చాలామంది ఆలోచ‌న‌లో ప‌డిపోయారు.

అమ్మ ఇచ్చిన అదృష్ట‌పు రింగులు అవి..

చిన్న‌త‌నం నుంచి కుటుంబం కోసం ఎంత క‌ష్ట‌ప‌డిందో వెయిట్ లిఫ్టింగ్ శిక్షణ కోసం కూడా అంత‌గానే చాను మీరాబాయ్ క‌ష్ట‌ప‌డింది. 2011లో జూనియ‌ర్ కేట‌గిరీలో తొలిసారి నేష‌న‌ల్ మెడ‌ల్ గెలిచింది. ఆ త‌ర్వాత 2014లో జ‌రిగిన కామ‌న్‌వెల్త్ గేమ్స్‌తో తొలిసారి అంత‌ర్జాతీయ వేదిక‌గా త‌న స‌త్తా చాటింది. తొలిసారే 48 కేజీల విభాగంలో సిల్వ‌ర్ మెడ‌ల్ అందుకుంది. అదే ఉత్సాహంతో 2014లో ఏషియ‌న్ గేమ్స్‌లో బ‌రిలోకి దిగినా విఫ‌ల‌మైంది. దీంతో 2016 రియో ఒలింపిక్స్ ల‌క్ష్యంగా చాలా క‌ష్ట‌ప‌డింది చాను మీరాబాయ్‌. త‌న కూతురు ప‌డుతున్న క‌ష్టాన్ని చూసిన చాను త‌ల్లి సైఖోమ్ ఓంగ్బీ టాంబీ లైమా ఒక బ‌హుమ‌తినిచ్చింది. అవే ఒలింపిక్ రింగుల్లాంటి చెవి దిద్దులు. త‌న బిడ్డ‌కు అదృష్టం క‌లిసి రావాల‌ని ఆ త‌ల్లి ఎంతో ఆశ‌తో చెవి రింగుల‌ను చేయించింది.

తల్లి కష్టం వృథా పోలేదు

- Advertisement -

చాను మీరాబాయికి చెవి రింగులు చేయించేందుకు ఇంట్లో ఉన్న బంగారం మొత్తం అమ్మేసింది.. అప్ప‌టిదాకా పైసా పైసా కూడ‌బెట్టి జ‌మ చేసిన డ‌బ్బు మొత్తం పెట్టి ఈ ఒలింపిక్ రింగ్స్‌ను పోలిన చెవి దిద్దుల‌ను చేయించింది. కానీ అప్పుడు ఆ త‌ల్లి ఆశ నెర‌వెర‌లేదు. 2016 రియో ఒలింపిక్స్‌లో చానుకు తీవ్ర నిరాశ ఎదురైంది. క్లీన్ అండ్ జెర్క్‌లో ఒక్క‌సారి కూడా బ‌రువు ఎత్త‌లేక నిరాశ‌తో వెనుదిరిగింది. ఈ ఊహించ‌ని ప‌రిణామంతో తీవ్రంగా క‌ల‌త చెందిన ఆమె.. గేమ్‌ను వ‌దిలేయాల‌ని భావించింది. కానీ అమ్మ ఇచ్చిన ఆ చెవి రింగుల‌ను చూసిన‌ప్పుడ‌ల్లా చానులో ప‌ట్టుద‌ల మ‌రింత పెరిగింది. ఎలాగైనా ఒలింపిక్స్‌లో ఒక్క ప‌త‌క‌మైనా గెలిచి తీరాల‌ని అమ్మ త్యాగానికి అర్థం చేకూర్చాల‌ని రెట్టింపు క‌ష్ట‌ప‌డింది. ఇన్నేళ్ల‌కు టోక్యో ఒలింపిక్స్‌లో ర‌జ‌త ప‌తాకాన్ని సాధించి అమ్మ క‌ల‌ను నెర‌వేర్చింది.

Olympics 2020: Mirabai Chanu Photos

ప‌త‌కంతోనే వ‌స్తా అని మాటిచ్చింది

శ‌నివారం జ‌రిగిన ఒలింపిక్స్ గేమ్స్‌లో 49కేజీల విభాగంలో ర‌జ‌త ప‌తాకాన్ని అందుకోవ‌డం టీవీలో చూసి ఆమె త‌ల్లి ఎంతో ఎమోష‌న్ అయింది. ఆ అపురూప క్ష‌ణాల‌ను చూస్తూ ఎంతో ఉప్పొంగిపోయింది. చాను చెవుల‌కు రింగుల‌ను చూసి ఆనాటి క్ష‌ణాల‌ను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనైంది. ఈ ఒలింపిక్స్‌లో క‌చ్చితంగా గోల్డ్ మెడ‌ల్ గెలుస్తాన‌ని.. కుద‌ర‌క‌పోతే క‌నీసం ఏదో ఒక ప‌త‌కంతో వ‌స్తాన‌ని చాను చెప్పింద‌ని.. అన్న‌ట్టుగా ఇప్పుడు సిల్వ‌ర్ మెడ‌ల్ గెలిచింద‌ని చాను త‌ల్లి చెప్పుకొచ్చింది.

Chanu Mirabai | మీరాబాయ్ చాను.. క‌ట్టెలు మోసిన చేతులే సిల్వ‌ర్ మెడ‌ల్ తీసుకొచ్చాయి

Tokyo Olympics: సూప‌ర్ వుమ‌న్ మీరాబాయ్‌పై ప్ర‌శంస‌ల వెల్లువ‌

Tokyo Olympics: తొలి గోల్డ్ మెడ‌ల్ చైనా ఖాతాలో.. ఇండియ‌న్ షూట‌ర్లు ఫెయిల్‌

Tokyo Olympics : ఈ ఏడుగురు వ‌నితల్లో స్వ‌ర్ణం తెచ్చేదెవ‌రో

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana