హైదరాబాద్, ఆట ప్రతినిధి: అంతర్జాతీయ స్థాయి క్రికెట్లో అదరగొడుతున్న రాష్ట్ర యువ క్రికెటర్ గొంగడి త్రిషారెడ్డికి తగిన రీతిలో సత్కారం లభించింది. రీజెన్సీ కాలేజీ ఆఫ్ కలినరీ ఆర్ట్స్ అకాడమీ వార్షికోత్సవ వేడుకలకు వచ్చిన త్రిషను కాలేజీ ప్రిన్సిపల్ రమేశ్‌రెడ్డి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా త్రిష మాట్లాడుతూ ‘మ్యాచ్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు మైదానం అవతల చాలా మంది కష్టపడుతారు. వారి కష్టాన్ని నేను ఇప్పుడు ప్రత్యక్షంగా చూశాను. క్రికెట్ పట్ల ఉన్న ప్రేమ, అభిమానం విద్యార్థుల్లో కనిపించింది. క్రికెట్ థీమ్‌తో చేసిన ఆహార పదార్థాలు చాలా రుచికరంగా ఉన్నాయి’ అని చెప్పింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.