ముంబై: ఫిడే, టెక్ మహేంద్ర ఆధ్వర్యంలో ముంబై వేదికగా నిర్వహిస్తున్న గ్లోబల్ చెస్ లీగ్ (జీసీఎల్) రెండో సీజన్లో అలస్కన్ నైట్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. గుకేశ్, అర్జున్ వంటి గ్రాండ్మాస్టర్లు ఉన్న నైట్స్.. ఆడిన ఐదు మ్యాచ్ల్లో నాలుగు ఓడినా తప్పక గెలవాల్సిన ఐదో మ్యాచ్లో.. అల్పైన్ ఎస్జీ పైపర్స్పై విజయాన్ని అందుకుంది.