NZvIND: గ్లెన్ ఫిలిప్స్ సెంచరీ.. ఇండియా టార్గెట్ 260
Glenn Philips: కివీస్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్.. సెంచరీతో చెలరేగిపోయాడు. 47 బంతుల్లో 107 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 10 సిక్సర్లు, ఆరు బౌండరీలు ఉన్నాయి. ఆక్లాండ్‌లో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో భారత్‌కు 260 రన్స్ టార్గెట్ ఇచ్చింది కివీస్.
ఆక్లాండ్: కివీస్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ సెంచరీ కొట్టాడు. భారత్‌తో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్(NZvIND)లో అతను చెలరేగి ఆడాడు. దీంతో కివీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 259 రన్స్ చేసింది. గ్లెన్ ఫిలిప్స్ 49 బంతుల్లో 107 రన్స్ చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో మొత్తం 10 సిక్సర్లు, 6 బౌండరీలు ఉన్నాయి. 46 బంతుల్లోనే ఫిలిప్స్ సెంచరీ పూర్తి చేశాడు. టీ20ల్లో ఫిలిప్స్‌కు మూడో సెంచరీ కావడం విశేషం. ఇక అర్షదీప్ టీ20ల్లో 150వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. సాంట్నర్‌ను ఔట్ చేసిన అతను ఆ అరుదైన రికార్డును వశం చేసుకున్నాడు.
Innings Break!
New Zealand post a total of 259/7 for India to chase.
Scorecard – https://t.co/fx264c9iLe #NZvIND https://t.co/GxwJ1GiBJx
— BCCI (@BCCI) October 30, 2026
కివీస్ గడ్డపై ఏ జట్టు అయినా టీ20ల్లో 250 ప్లస్ స్కోరు చేయడం ఇదే మొదటిసారి. కివీస్ బ్యాటర్లలో మైఖేల్ బ్రేస్‌వెల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతను 25 బంతుల్లోనే 65 రన్స్ స్కోరు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. భారత బౌలర్లలో స్పీడ్‌స్టర్ మయాంక్ యాదవ్ రాణించాడు. అతను తన ఖాతాలో మూడు వికెట్లు వేసుకున్నాడు. అర్షదీప్, ప్రిన్స్, నితీశ్, అక్షర్.. చెరో వికెట్ తీసుకున్నారు. ఫిన్ అలెన్ 31, మిచెల్ 24 రన్స్ చేశారు. అయిదో వికెట్‌కు బ్రేస్‌వెల్, ఫిలిప్స్ 115 రన్స్ జోడించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: గ్లెన్ ఫిలిప్స్ సెంచరీ.. ఇండియా టార్గెట్ 260
మద్దూరును కరువు మండలంగా ప్రకటించాలి.. మండల సభను బహిష్కరించిన సర్పంచులు
Eetha Trailer | ‘ఛావా’ దర్శకుడి కొత్త సినిమా.. శ్రద్ధా కపూర్ ‘ఈఠా’ ట్రైలర్ విడుదల!
‘పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి’
Europe | వాతావరణ మార్పులతోనే యూరప్‌లో ఎండలు.. 50వేల మరణాలకు అవే కారణం..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

