Glenn Maxwell : ఐపీఎల్ 18 సీజన్‌కు ముందు ఆసక్తి పరిణామాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలు జట్లు హెడ్కోచ్లపై వేటు వేయగా.. ఎవరిని అట్టిపెట్టుకోవాలనుకునే ఆటగాళ్ల జాబితా తయారీలో కొన్ని ఫ్రాంచైజీలు తలమునకలై ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్(Glenn Maxwell) అభిమానులను షాక్‌కు గురి చేశాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru)ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశాడు.
దాంతో, బెంగళూరును వీడేందుకు మ్యాక్స్‌వెల్ సిద్ధమయ్యాడా? అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. అయితే.. ఈ విషయంపై మ్యాక్సీగానీ, ఆర్సీబీగానీ ఇంకా స్పందించలేదు. పవర్ హిట్టర్ అయిన మ్యాక్స్‌వెల్ ఐపీఎల్లో 2021 ఆర్సీబీకి ఆడుతున్నాడు.
Glenn Maxwell unfollows RCB on Instagram ahead of IPL 2025 mega auction
📷:BCCI #ipl #ipl2025 #rcb #royalchallengersbangalore #glennmaxwell pic.twitter.com/9iCDa3AvnQ
— SportsTiger (@The_SportsTiger) July 30, 2024
ఆ ఏడాది వేలానికి ముందు పంజాబ్ కింగ్స్(Punjab Kings) ఈ స్టార్ ఆల్‌రౌండర్‌ను వదిలేయగా..రూ.14.25 కోట్లకు బెంగళూరు కొన్నది. అయితే.. తొలి రెండు సీజన్లు 513, 301 పరుగులతో సత్తా చాటిన మ్యాక్సీ 16వ సీజన్లోనూ 5 అర్ధ శతకాలతో హోరెత్తించాడు. కానీ, ఏమైందో తెలియదు 17వ సీజన్లో మాత్రం తేలిపోయాడు.
అంతకుముందు భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023)లో డబుల్ సెంచరీతో రికార్డు సృష్టించిన మ్యాక్సీ మెగా టోర్నీలో మాత్రం అట్టర్ ఫ్లాప్ షోతో యాజమన్యం, కెప్టెన్ అతడిపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశాడు. 10 మ్యాచుల్లో మరీ అధ్వాన్నంగా 52 రన్స్ కొట్టాడంతే. అది కూడా 5.278 సగటుతో.
దాంతో, వచ్చే ఏడాది మెగా వేలానికి ముందు మ్యాక్సీని ఆర్సీబీ వదిలేస్తుందనే వార్తలు వినిపించాయి. ఆ వార్తలకు బలం చేకూరుస్తున్నట్టుగా మంగళవారం మ్యాక్సీ బెంగళూరును అన్‌ఫాలో చేశాడు. దాంతో, 18వ సీజన్లో కొత్త జట్టుకు ఆడబోతున్నానేనే విషయాన్ని ఈ ఆసీస్ ఆల్‌రౌండర్ చెప్పకనే చెప్పాడని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.