ఆస్ట్రేలియా క్రికెటర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ మంగళవారం తన తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. క్వారంటైన్‌ను పూర్తి చేసుకున్న మాక్స్వెల్, మరో రెండు రోజుల్లో ఐపీఎల్ 2021 ఆరంభంకానున్న నేపథ్యంలో సాధన మొదలెట్టాడు. మిడిలార్డర్ బలోపేతం కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన వేలంలో మాక్సీని బెంగళూరు రూ.14.25కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్లో విఫలమైనా ఈసారి వేలంలో ఊహించని ధర పలికిన మాక్స్వెల్ బెంగళూరు తలరాత మారుస్తాడో చూడాలి.
తన మొదటి ప్రాక్టీస్ సెషన్లోనే మాక్సీ రివర్స్ స్వీప్ షాట్లతో అలరించాడు. పేస్, స్పిన్నర్ల బౌలింగ్‌లో అలవోకగా భారీ సిక్సర్లు బాదేశాడు. స్పిన్నర్ చాహల్ వేసిన బంతిని రివర్స్ స్వీప్ షాట్ ఆడి సిక్స్ కొట్టాడు. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ డేనియల్ క్రిస్టియన్ వేసిన బంతిని కూడా రివర్స్ స్కూప్ షాట్ ఆడాడు. మాక్స్వెల్ బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియోను ఆర్సీబీ ట్విటర్లో పోస్ట్ చేసింది.
Glenn Maxwell’s Day Out @Gmaxi_32 came. Maxwell reverse swept. And Maxwell had fun. Watch The Big Show and Kyle Jamieson at their first practice session for #RCB ahead of #IPL2021.#PlayBold #WeAreChallengers pic.twitter.com/naMXQcAROQ
— Royal Challengers Bangalore (@RCBTweets) April 6, 2021