Glenn Maxwell : ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్(Glenn Maxwell) టీ20 లీగ్ కెప్టెన్‌గా వైదొలిగాడు. బిగ్‌బాష్ లీగ్(BBL)లో ఐదుసార్లు మెల్బోర్న్ స్టార్స్(Melbourne Stars)ను నడిపించిన మ్యాక్సీ సారథిగా తప్పుకున్నాడు. బీబీఎల్ 2023-24లో మాక్స్వెల్ సారథ్యంలోని మెల్బోర్న్ చెత్త ఆటతో నిరాశపరిచింది. 10 మ్యాచుల్లో కేవలం నాలుగే విజయాలతో ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించింది. దాంతో, జట్టు వైఫల్యానికి బాధ్యత వహిస్తూ మ్యాక్సీ సారథిగా తప్పుకున్నాడు.
హోబర్ట్ హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెల్బోర్న్ జట్టు 7 రన్స్ తేడాతో ఓడిపోయింది. హరికేన్స్ జట్టు నిర్దేశించిన 188 పరుగుల ఛేదనలో మ్యాక్స్‌వెల్ సేన 180 రన్స్‌కే పరిమితమైంది. దాంతో, మ్యాచ్ తర్వాత తాను కెప్టెన్సీ వదిలేస్తున్న విషయాన్ని మ్యాక్స్‌వెల్ జట్టు సభ్యులకు తెలియజేశాడు.
The skipper spending some time with fans 💚 pic.twitter.com/pnmcviZwkp
— Melbourne Stars (@StarsBBL) January 15, 2024
‘తొలి రెండు సంవత్సరాలు అద్భుతంగా ఆడి ఫైనల్‌కు వెళ్లాం. కానీ, ఆఖరి మెట్టుపై బోల్తా పడ్డాం. గత నాలుగు సీజన్లలో ఒక్కసారి ఫైనల్‌కు చేరకపోవడం చికాకుగా అనిపించింది. జట్టులో అందరూటాప్ క్లాస్ ఆటగాళ్లే ఉన్నారని నా నమ్మకం. అయితే.. గాయాల కారణంగా కొందర్నీ రీ ప్లేస్ చేయాల్సి వచ్చింది. గెలవాల్సిన మ్యాచ్‌లో ప్రత్యర్థికి చాన్స్ ఇవ్వడం క్రికెట్లో ఎప్పుడు చేయొద్దు. మాకు మేముగా ఈ పరిస్థితి తెచ్చుకున్నాం’ అని మ్యాక్స్‌వెల్ తెలిపాడు.
Thank you to all our members + fans who cheered us on in #BBL13 💚
We’re always grateful for your support. pic.twitter.com/6aUKoZXPlY
— Melbourne Stars (@StarsBBL) January 15, 2024
బిగ్‌బాష్ లీగ్‌లో సారథిగా మ్యాక్స్‌వెల్‌కు మంచి రికార్డు ఉంది. మెల్బోర్న్ స్టార్స్‌ను ఈ ఆల్‌రౌండర్ రెండుసార్లు బీబీఎల్ ఫైనల్‌కు తీసుకెళ్లాడు. అ యితే.. ఆ రెండు పర్యాయాలు రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. 2018-19 ఫైనల్లో మెల్బోర్న్ రెనెగ్రేడ్స్, 2019-20 ఎడిషన్‌లో సిడ్నీ సిక్సర్స్ ట్రోఫీని ఎగరేసుకుపోయాయి.