అహ్మదాబాద్: ఐపీఎల్ 2021 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ వేసిన నాలుగో ఓవర్ మూడో బంతిని సిక్స్ కొట్టిన నితీశ్ రాణా తర్వాతి బంతిని ముందుకొచ్చి ఆడే క్రమంలో స్టంపౌట్ అయ్యాడు. దీంతో ఆ తర్వాతి ఓవర్లలో కోల్‌కతా ఆచితూచి బ్యాటింగ్ చేసింది. మరో ఓపెనర్ శుభ్‌మన్ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగుల పెట్టిస్తున్నాడు. ఆరు ఓవర్లకు కోల్‌కతా 45/1తో నిలిచింది. పవర్‌ప్లే ఆనంతరం ఢిల్లీ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటున్నారు. 9 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది. గిల్(34), త్రిపాఠి(15) క్రీజులో ఉన్నారు.
1⃣ wicket for @DelhiCapitals in the powerplay 👊
— IndianPremierLeague (@IPL) April 29, 2021
At the end of 6 overs, @KKRiders are 45/1
Follow the game 👉 https://t.co/iEiKUVOcN8#VIVOIPL #DCvKKR pic.twitter.com/LgLUPtHO5N