BGT 2024-25 : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సన్నద్ధతలో భాగంగా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతూ గాయపడిన శుభ్‌మన్ గిల్ (Shubman Gill) తొలి టెస్టుకు దూరమయ్యేలా ఉన్నాడు. ఫీల్డింగ్ చేస్తుడంగా బంతి తగిలి అతడి ఎడమ బొటనవేలు విరగడంతో అతడు కోలుకునేందుకు సమయం పట్టనుంది. దాంతో, కెప్టెన్ రోహిత్ శర్మ గౌర్హాజరీలో అతడిని ఓపెనర్‌గా పంపాలనుకున్న మేనేజ్మెంట్కు పెద్ద షాక్ తగిలింది.
గత పర్యటనలో ఆసీస్ బౌలర్లును దీటుగా ఎదుర్కొన్న గిల్ జట్టుకు దూరమవ్వడం పెద్ద లోటే. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో మరొకరిని ఆడించేందుకు కోచ్ గౌతం గంభీర్ సిద్ధమవుతున్నాడు. అందుకని నామమాత్రపు టెస్టులో ఆస్ట్రేలియా ఏపై రాణించిన ముగ్గురు కుర్రాళ్లను అక్కడే ఉండాల్సిందిగా బీసీసీఐ ఆదేశించింది.
కంగారూ గడ్డపై ‘భారత ఏ’ జట్టు తరఫున చెలరేగి ఆడిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, దేవ్‌దత్ పడిక్కల్, సాయి సుదర్శన్‌లను ఆస్ట్రేలియలోనే ఉండిపోవాలని బీసీసీఐ చెప్పింది. దాంతో, గిల్ బదులు వీళ్లలో ఒకరు తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే త్రిమూర్తుల్లో ఒకరు టెస్టుల్లో అరంగేట్ర చేయం ఖాయం. అయితే.. గిల్ స్థానంలో గైక్వాడ్, పడిక్కల్, సాయిలలో ఒకరికి అవకాశం దక్కుతుందా? లేదా? అనే ఈ విషయమై బీసీసీఐగానీ, కోచ్ గౌతం గంభీర్గానీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
🚨🚨
Ruturaj Gaikwad, Devdutt Padikkal To Stay In Australia As Back-Up Batters For India: Report [ News18 ] pic.twitter.com/R1e77YFu5y
— Dhonism (@Dhonismforlife) November 17, 2024
ఇక భారత జట్టు సభ్యులతో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లోనే గాయపడిన కేఎల్ రాహుల్ మూడో రోజు యథావిధిగా బ్యాటింగ్ కొనసాగించాడు. మాజీ సారథి విరాట్ కోహ్లీ భారీ షాట్లు ఆడి అర్ధ శతకం సాధించగా.. వికెట్ కీపర్ రిషభ్ పంత్, యువకెరటం ధ్రువ్ జురెల్‌లు తమ స్టయిల్లో రెచ్చిపోయారు.
Virat Kohli in the match simulation at the WACA. pic.twitter.com/0FKnKA7GN7
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 17, 2024
నవంబర్ 22న పెర్త్ వేదికగా బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ మొదలవ్వనుంది. ఈమధ్యే రెండోసారి తండ్రి అయిన కెప్టెన్ రోహిత్ కొన్ని రోజులు కుటుంబంతోనే గడిపే ఆలోచనలో ఉన్నాడు. దాంతో, పెర్త్ టెస్టుకు ఇంకో ఐదు రోజులే ఉండడంతో భారత తుది జట్టు ఎంపికపై సెలెక్టర్లు, కోచ్ గంభీర్ గట్టిగానే కసరత్తు చేస్తున్నారు.