కోల్‌కతా: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు(INDvSA) తొలి ఇన్నింగ్స్ రెండో రోజు భోజన విరామ సమయానికి ఇండియా 4 వికెట్లు కోల్పోయి 138 రన్స్ చేసింది.ఇవాళ తొలి సెషన్లో ఇండియా కీలకమైన మూడు వికెట్లను చేజార్చుకున్నది. లంచ్‌కు ముందే రిషబ్ పంత్ ఔటయ్యాడు. అతను 27 రన్స్ చేశాడు. పంత్ ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ఉదయం నిలకడగా ఆడిన ఓపెనర్ రాహుల్ కూడా లంచ్‌కు ముందు తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. రాహుల్ అత్యధికంగా 39 రన్స్ చేసి నిష్క్రమించాడు.
ఇవాళ ఉదయం రాహుల్, సుందర్ రెండో వికెట్‌కు 57 రన్స్ జోడించారు. ఆ ఇద్దరూ ఆచితూచి బ్యాటింగ్ చేశారు. బ్యాటింగ్‌కు కష్టంగా మారిన ఈడెన్ మైదానంలో చాలా ఓపికతో పరుగులు రాబట్టారు. కానీ ఆఫ్ స్పిన్నర్ సైమన్ హర్మర్ బౌలింగ్‌లో సుందర్ ఔటయ్యాడు. ఇక కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో రాహుల్ క్యాచ్ ఇచ్చాడు. ఫస్ట్ స్లిప్‌లో ఉన్న అడన్ మార్క్రమ్ ఆ రెండు క్యాచ్‌లు పట్టేశాడు.
ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఇవాళ కేవలం మూడు బంతులే ఆడిన కెప్టెన్ గిల్ రిటైర్డ్ హార్ట్ అయ్యాడు. స్వీప్ షాట్‌తో ఫోర్ కొట్టే సమయంలో గిల్ మెడకు గాయమైనట్లు తెలుస్తోంది. నొప్పి తీవ్రం కావడంతో అతను మైదానం విడిచి వెళ్లాడు. ప్రస్తుతం క్రీజ్‌లో ద్రువ్ జురెల్, రవీంద్ర జడేజా ఉన్నారు. ఇండియన్ జట్టు ఇంకా 21 రన్స్ వెనుకబడి ఉంది. సౌతాఫ్రికా తన ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 159 రన్స్‌కు ఆలౌటైన విషయం తెలిసిందే.
Lunch on Day 2 🍲#TeamIndia trail South Africa by 2⃣1⃣ runs in the 1⃣st innings.
Ravindra Jadeja and Dhruv Jurel will resume proceedings after the break.
Scorecard ▶️ https://t.co/okTBo3qxVH #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/DNHwKzCAAB
— BCCI (@BCCI) November 15, 2025