ముంబై: ఇండియన్ బ్యాటర్ శుభమన్ గిల్ తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడవ టెస్టు(Ind Vs Nz)లో అతను వ్యక్తిగతంగా 90 రన్స్ చేసి క్యాచ్ అవుటయ్యాడు. స్పిన్నర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై భారత బ్యాటర్లు ఘోరంగా తడబడుతున్నారు. 146 బంతుల్లో ఏడు ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 90 రన్స్ చేశాడు గిల్. భోజన విరామం తర్వాత మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు అతికష్టంగా పరుగులు రాబట్టారు. జడేజా, సర్ఫరాజ్, గిల్ ఔటయ్యారు. ప్రస్తుతం భారత్ లీడింగ్‌లోకి వచ్చింది. 58 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 రన్స్ చేసిన ఇండియా.. ప్రస్తుతం 12 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్‌కు అయిదు వికెట్లు దక్కాయి. అజాజ్ పటేల్ 21 ఓవర్లలో 98 రన్స్ ఇచ్చి అయిదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.