IPL 2025 : ఐపీఎల్18వ సీజన్లో భీకర ఫామ్‌లో ఉన్న గుజరాత్ టైటన్స్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(60), సాయి సుదర్శన్(56)లు మరోసారి చితక్కొట్టారు. ఎక్నాస్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్(LSG) బౌలర్లకు చుక్కలు చూపించారు. అర్ధ శతకాలతో చెలరేగిన ఈ ద్వయం తొలి వికెట్‌కు 120 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారీ స్కోర్‌కు బాటలు వేసింది. అయితే.. స్ట్రాటజిక్ టైమౌట్ తర్వాత పుంజుకున్న లక్నో బౌలర్లు గుజరాత్ మిడిలార్డర్‌ను క్రీజులో నిలవనీయలేదు. ఆఖర్లో షెర్ఫానే రూథర్‌ఫొర్డ్(22) ఒక్కడే మెరుపులు మెరిపించగా గిల్ బృందం నిర్ణీత ఓవర్లలో 180 రన్స్ చేయగలిగింది.
టేబుల్ టాపర్ గుజరాత్ టైటన్స్‌కు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(60 : 38 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్), సాయి సుదర్శన్(56 : 37 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్) అదిరే శుభారంభం ఇచ్చారు. ఓవర్‌కు ఒకటి.. రెండు బౌండరీలు బాదేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. అవేశ్ ఖాన్ వేసిన 6వ ఓవర్ తొలి బంతిని గిల్ బౌండరీకి పంపడంతో జట్టు స్కోర్ 50కి చేరింది. పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా 54 రన్స్ కొట్టిన గుజరాత్ ఇన్నింగ్స్ ఆ తర్వాత మరింత దూకుడుగా సాగింది.
సాయి సుదర్శన్(56), శుభ్‌మన్ గిల్(60)
కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన గిల్ అర్ధ శతకంతో రెచ్చిపోయాడు. సుదర్శన్‌తో కలిసి తొలి వికెట్‌కు 120 రన్స్ జోడించి పటిష్ట స్థితిలో నిలిపాడు. అయితే.. ప్రమాదకరంగా మారుతున్న ఈ ద్వయాన్ని అవేశ్ ఖాన్ విడదీశాడు. 13వ ఓవర్ తొలి బంతికిగిల్ లాంగాన్‌లో భారీ షాట్‌కు యత్నించగా.. బౌండరీ లైన్ వద్ద మర్కర్మ్ అద్భుతంగా క్యాచ్ పట్టాడు. ఆ కాసేపటికే బిష్ణోయ్ బౌలింగ్‌లో సుదర్శన్ ఆఫ్‌సైడ్ కొట్టిన బంతిని పూరన్ ఒడిసి పట్టుకున్నాడు. దాంతో.. 122 వద్ద గుజరాత్ రెండు కీలక వికెట్లు కోల్పోయింది.
ఓపెనర్లను పెవిలియన్ చేర్చిన లక్నో బౌలర్లు తమ జోరు చూపిస్తూ వరుసగా వికెట్లు తీశారు. వాషింగ్టన్ సుందర్(2)ను ఔట్ చేసిన బిష్ణోయ్ రెండో వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. విధ్వంసక ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరైన జోస్ బట్లర్(16) సైతం స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగాడు. దిగ్వేశ్ రథీ బౌలింగ్‌లో బట్లర్ వికెట్ పారేసుకున్నాడు. బట్లర్ ఆడిన బంతి ఎడ్జ్ తీసుకొని గాల్లోకి లేవగా.. శార్ధూల్ ఠాకూర్ పరుగెడుతూ వెళ్లి క్యాచ్ పట్టాడు.
𝘽𝙧𝙞𝙡𝙡𝙞𝙖𝙣𝙩 𝘽𝙞𝙨𝙝𝙣𝙤𝙞 😎
An over with double delight that has put #LSG back into the match ✌️
Updates ▶ https://t.co/VILHBLEerV #TATAIPL | #LSGvGT | @bishnoi0056 pic.twitter.com/4ylELVJpqm
— IndianPremierLeague (@IPL) April 12, 2025
అంతే.. దిగ్వేశ్ తనదైన స్టయిల్లో మైదానంలోని గడ్డి మీద నోట్‌బుక్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. 25 పరుగుల వ్యవధిలోనే 4 వికెట్లు తీసిన లక్నో బౌలర్లు గుజరాత్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు. షెర్ఫానే రూథర్‌ఫొర్డ్(22), షారుక్ ఖాన్(11)లు జట్టు స్కోర్ 150 దాటించారు. శార్థూల్ వేసిన 20వ ఓవర్ తొలి బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు షారుక్. మూడో బంతికి రూథర్‌ఫొర్డ్ ఎల్బీగా డగౌట్ చేరాడు. ఆ తర్వాత బంవతికే రాహుల్ తెవాటియా(0) సిక్సర్ కొట్టబోయి మర్క్రమ్ చేతికి చిక్కాడు. దాంతో, గుజరాత్ నిర్ణీత ఓవర్లలో6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.