 
                                                            Sunil Gavaskar : వరల్డ్ కప్ లీగ దశ ఆఖర్లో పుంజుకున్న భారత జట్టు టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. ఏడుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాను సెమీఫైనల్లో ఓడించిన టీమిండియా కలల ట్రోఫీని ముద్దాడాలనే పట్టుదలతో ఉంది. డీవై పాటిల్ మైదానంలో ఆదివారం దక్షిణాఫ్రికాను చిత్తు చేసిందంటే తొలిసారి విశ్వవిజేతగా అవతరించనుంది. స్వదేశంలో కప్‌ను ఒడిసిపట్టే అవకాశాన్ని వదులుకోవద్దని యావత్ భారతం కోరుకుంటోంది. అదే జరిగితే తాను టీమిండియా స్టార్‌తో కలిసి పాట పాడుతానని అంటున్నాడు సునీల్ గవాస్కర్(Sunil Gavaskar). ఇంతకూ ఆయన ఎవరితో పాట ఆలపించేందుకు సిద్దమవుతున్నాడో తెలుసా..?
ప్రపంచ కప్ కోసం దశాబ్దాలుగా నిరీక్షిస్తున్న భారత మహిళల జట్టు ఈసారి దిశగా సాగుతోంది. సెమీఫైనల్లో రికార్డు లక్ష్యాన్ని ఛేదించి ఆత్మవిశ్వాసం కూడగట్టుకున్న టీమిండియా ఫైనల్లోనూ రెచ్చిపోవాలనుకుంటోంది. ఆదివారం సఫారీలకు చెక్ పెడితే మొదటిసారి ప్రపంచ కప్ విజేతగా చరిత్ర సృష్టించనుంది భారత్. ఈసారి హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం కప్ కొట్టాలని మాజీ క్రికెటర్లు, అభిమానులు కోరుకుంటున్నారు. దేశానికి వరల్డ్ కప్ అందిస్తే ‘రిటర్న్ గిఫ్ట్’గా తాను పాట పాడేందుకు సిద్ధమేనని సునీల్ గవాస్కర్ ప్రకటించేశాడు. సెమీస్‌లో శతకంతో చెలరేగిన జెమీమా రోడ్రిగ్స్()తో కలిసి తాను ఫ్యాన్స్‌ను అలరిస్తానని సన్నీ అంటున్నాడు.
Sunil Gavaskar × Jemimah Rodrigues — a special duet awaits if India lifts the trophy! 🎶 🏆#CricketTwitter #CWC25 #INDvSA Via: Sports Today pic.twitter.com/pvI1flKJ7J
— Female Cricket (@imfemalecricket) October 31, 2025
‘ఫైనల్లో భారత జట్టు గెలుపొంది కప్ అందుకుంటే నేను చాలా సంతోషిస్తాను. జెమీమా రోడ్రిగ్స్ అంగీకరిస్తే ఆమెతో కలిసి మీకోసం చక్కని పాట పాడుతా. ఆమెకు గిటార్ ఉంది. నేను నా గొంతుతో పాట ఆలపిస్తా. మేమిద్దరం ఇదివరకూ బీసీసీఐ అవార్డుల కార్యక్రమంలో కలిసి పాడాం. అప్పుడు స్టేజిమీద ఒక బ్యాండ్ టీమ్ ఉంది. అక్కడే చేతిలో గిటార్‌తో జెమీమాను చూశాను. ఈసారి భారత మహిళల జట్టు ప్రపంచ కప్‌ను అందుకుంటే నేను, తను పాట పాడుతాం’ అని గవాస్కర్ వెల్లడించాడు. నిరుడు బీసీసీఐ నమాన్ అవార్డ్స్ వేడుక కార్యక్రమంలో సన్నీ, జెమీమా పాటతో ఆహుతులను ఉర్రూతలూగించారు. మరోసారి వీరి జోడీ వేదికపై మెరవాలని ఆశిద్దాం.
📽️ Raw reactions after an ecstatic win 🥹
The #WomenInBlue celebrate a monumental victory and a record-breaking chase in Navi Mumbai 🥳
Get your #CWC25 tickets 🎟️ now: https://t.co/vGzkkgwXt4 #TeamIndia | #INDvAUS pic.twitter.com/MSV9AMX4K1
— BCCI Women (@BCCIWomen) October 31, 2025
ఉత్కంఠ రేపిన సెమీ ఫైనల్లో భారత జట్టు జయభేరి మోగించింది. ఏడుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాకు చెక్ పెడుతూ రికార్డు లక్ష్యాన్ని మరో ఓవర్ ఉండగానే ఊదిపడేసింది. భారీ ఛేదనలో జెమీమా రోడ్రిగ్స్(127 నాటౌట్) చిరస్మరణీయ శతకంతో చెలరేగగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(89)తో సెంచరీ భాగస్వామ్యంతో విజయానికి బాటలు వేశారు. ఆఖర్లో రీచా ఘోష్(26), అమన్‌జోత్ కౌర్(11 నాటౌట్) ఒత్తిడిలోనూ గొప్పగా ఆడారు. దాంతో.. వరల్డ్ కప్ నాకౌట్ చరిత్రలో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించింది టీమిండియా. లీగ్ దశలో ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న కౌర్ సేన 5 వికెట్ల తేడాతో కంగారూలను మట్టికరిపించింది.
 
                            