ముంబై: ఇంగ్లండ్‌లో జరిగే ‘ది హండ్రెడ్ లీగ్’ కోసం ఇటీవలే ముగిసిన వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ యాజమాన్యం కొనుగోలు చేయడంపై ఆగ్రహజ్వాల ఆగడం లేదు. తాజాగా ఈ విషయంపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందిస్తూ.. ‘2008లో ముంబై దాడులు జరిగిన తర్వాత ఐపీఎల్లో ఫ్రాంచైజీ యజమానులు పాకిస్థాన్ ఆటగాళ్లను పక్కనబెట్టేశారు. ఫ్రాంచైజీ నుంచి ఫీజు రూపంలో వచ్చిన మొత్తాన్ని పాకిస్థానీ ప్లేయర్ వారి ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లిస్తాడు.
అవే డబ్బులతో పాక్ ప్రభుత్వం ఆయుధాలు కొనుగోలు చేసి వాటిని భారత సైన్యంపైనే ప్రయోగిస్తున్నది. అంటే ఒక పాకిస్థానీ ఆటగాడికి చెల్లించే ఫీజు పరోక్షంగా అది భారత సైనికులు, ప్రజల ప్రాణాలు కోల్పోవడానికి కారణమవుతున్నది. అందుకే పాక్ క్రికెటైర్లెనా, సినిమా నటులైనా వారిని బహిష్కరించాలి’ అని చెప్పాడు.