Sunil Gavaskar : టీ20ల్లో ప్రమాదకరమైన ఆటతో బౌలర్లకు వణుకు పుట్టించే సూర్యకుయార్ యాదవ్ (Suryakumar Yadav) ఇటీవల ఫామ్ కోసం తంటాలు పడుతున్నాడు. మెరుపు షాట్లతో అలరించే ఈ చిచ్చరపిడుగు.. స్వదేశంలో దక్షిణాఫ్రికా బౌలర్లకు అలవోకగా వికెట్ ఇచ్చేస్తున్నాడు. ధర్మశాలలో జరిగిన మూడో టీ20లోనూ స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగాడు సూర్య. దాంతో.. మరో రెండు నెలల్లో ప్రపంచ కప్ సమీపిస్తున్న వేళ కెప్టెన్ ఫామ్ మేనేజ్మెంట్ను, అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో మిస్టర్ 360కి మాజీ క్రికెటర్ గవాస్కర్ (Sunil Gavaskar) విలువైన సలహా ఇచ్చాడు.
పొట్టి క్రికెట్లో స్కూప్, పికప్ షాట్లకు పెట్టింది పేరైన సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు.. అవే షాట్లకు ఔటవుతున్నాడు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో సూర్యాభాయ్ ఇలానే వెనుదిరిగాడు. ధర్మశాలలోనూ ఈ సొగసరి బ్యాటర్ పికప్ షాట్ టైమింగ్ కుదరక వికెట్ పారేసుకున్నాడు. దాంతో.. కొన్ని రోజులు ఆ షాట్‌ను పక్కన పెట్టేయాలని అతడికి సునీల్ గవాస్కర్ సూచిస్తున్నాడు. ‘తన అమ్ములపొదిలోని పికప్ షాట్‌ను సూర్య చాలా చక్కగా ఆడుతాడు.
Former India veteran Sunil Gavaskar has criticised Indian T20I captain Suryakumar Yadav for his shot selection amid poor form, advising him to keep the pick-up shot in cold storage until he regains form. pic.twitter.com/VGOHwtrHU9
— CricTracker (@Cricketracker) December 15, 2025
అయితే.. ఇప్పుడు అతడు ఫామ్‌లో లేకపోవడంతో పికప్ షాట్ మిస్సవుతోంది. స్టాండ్‌లో పడాల్సిన బంతి బౌండరీ లైన్లోనే గాల్లో లేస్తోంది. మంచి ఆరంభం లభించేదాకా సూర్య కొన్ని రోజులు ఆ పికప్ షాట్‌ను పక్కన పెట్టేస్తే మంచిది. ఎందుకంటే ఆ షాట్ కారణంగానే అతడు ఔటవుతున్నాడు. సూర్యలాంటి విధ్వంసక ఆటగాడు 12 పరుగులకే ఔటవ్వాలని టీమిండియా, అభిమానులు కోరుకోవడం లేదు’ అని గవాస్కర్ వెల్లడించాడు.
తనకు గుర్తింపు తీసుకొచ్చిన టీ20ల్లో విఫలమవుతుండడంపై భారత సారథి స్పందిస్తూ.. త్వరలోనే పుంజుకుంటానని అన్నాడు. నేను నెట్స్‌లో బాగా ఆడుతున్నాను. పరుగులు రావాల్సి ఉంటే అవే వస్తాయి. అంతేతప్ప నేను ఫామ్‌లో లేనని కాదు. అయితే.. ఇటీవల పెద్దగా పరుగులు చేయడం లేదు అని సూర్య తెలిపాడు. ఈ ఏడాది 20కి పైగా టీ20ల్లో తీవ్రంగా నిరాశపరిచాడు టీమిండియా కెప్టెన్. ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌పై ఆడిన 75 పరుగులతో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా చూస్తే.. అతడి సగటు 14 ఉండగా.. స్ట్రయిక్ రేటు 125గా ఉంది.
Suryakumar Yadav in the last 21 T20is:
21 (17), 4 (9), 1 (4), 0 (3), 12 (7), 14 (7), 0 (4), 2 (3), 7* (2), 47* (37), 0 (3), 5 (11), 12 (13), 1 (5), 39* (24), 1 (4), 24 (11), 20 (10), 12 (11), 5 (4), 12 (11).
– 239 runs.
– 13.27 average.
– 118.90 strike rate. pic.twitter.com/u8jXH9gLvO— Mufaddal Vohra (@mufaddal_vohra) December 14, 2025
స్వదేశంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్ షురూ కానుంది. ఈ మెగా టోర్నీ సన్నద్ధతలో టీమిండియాకు మరో ఏడు టీ20లు మాత్రమే మిగిలున్నాయి. సఫారీలతో సిరీస్ తర్వాత న్యూజిలాండ్‌తో పొట్టి సిరీస్‌కు ఎంపిక చేసిన స్క్వాడ్‌ను ప్రపంచకప్ కోసం తీసుకునే అవకాశముంది. సో.. ఫామ్‌లో ఉన్న వాళ్లకే వరల్డ్‌కప్ బెర్తు దక్కనుంది. ఈ పరిస్థితుల్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ లయ అందుకోకపోవడం టీమిండియా విజయాలపై ప్రభావం చూపుతోంది. ఆదివారం రాత్రి ధర్మశాలలో ఎంగిడి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదిన సూర్య.. అదే ఊపులో బంతిని గాల్లోకి లేపి ఔటయ్యాడు. స్వల్ప ఛేదనలో అజేయంగా నిలిచి జట్టును గెలిపిస్తాడనుకుంటే 11 బంతుల్లో 12 పరుగులకే పెవిలియన్ చేరాడీ విధ్వంసక క్రికెటర్. డిసెంబర్ 17న జరిగే నాలుగో టీ20లో సూర్య తన ప్రతాపం చూపించాలని కోరుకుందాం.
India captain Suryakumar Yadav is confident of finding his best form prior to the #T20WorldCup 🙌
More 👉 https://t.co/5kahoAuYFC pic.twitter.com/7dbZCTlViY
— ICC (@ICC) December 15, 2025