హైదరాబాద్, ఆట ప్రతినిధి: రామదాస్ స్మారక సీనియర్ టెన్నిస్ టోర్నమెంట్లో గౌతమ్-బోస్ కిరణ్ జంట సెమీఫైనల్‌కు చేరింది. నాంపల్లిలో జరుగుతున్న ఈ టోర్నీ 45+ పురుషుల డబుల్స్‌లో గౌతమ్-కిరణ్ జోడీ 7-1 తేడాతో ఆసిమ్-రఘు ద్వయంపై విజయం సాధించింది. 45+, 55+, 65+, 75+ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. వేర్వేరు మ్యాచ్‌ల్లో ఆనంద్ స్వరూప్-శ్రీనివాస్, నరసింహారెడ్డి-రమణ, పాల్ మనోహర్-సలీమ్, ధీరజ్-కుమార్ రాజు, అన్వర్ సుల్తాన్-దేవేందర్ రెడ్డి, మన్సూర్ మీర్జా-నర్లీకర్, రవిచంద్రన్-రమేశ్ బాబు, సురేశ్-ఏఎస్ రావు విజయాలు సాధించి ముందంజ వేశారు.