Sourav Ganguly : భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ (Sourav Ganguly) మరోసారి సొంత రాష్ట్రంలో క్రికెట్ బాస్‌గా సేవలందించనున్నాడు. గతంలోనే తన ముద్ర వేసిన ఈ వెటరన్ రెండోసారి బెంగాల్ క్రికెట్ సంఘం (CAB) అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నాడు. తన పెద్ద సోదరుడు స్నేహశిష్ గంగూలీ తదనంతరం బాధ్యతలు చేపట్టనున్నాడు. దాంతో మరోసారి బెంగాల్ క్రికెట్ గంగూలీ కుటుంబం చేతుల్లోకి రానుంది.
బెంగాల్ క్రికెట్ సంఘం వార్షిక సమావేశం సెప్టెంబర్ 22న జరుగనుంది. అదే రోజున కొత్త కార్యవర్గం కోసం ఎన్నికలు నిర్వహించనున్నారు. కాబట్టి.. సెప్టెంబర్ 14 ఆదివారం అధ్యక్ష పదవి కోసం గంగూలీ నామినేషన్ వేశాడు. అయితే.. అతడికి పోటీగా ఎవరూ లేకపోవడంతో ఏకగీవ్రంగా క్యాబ్ ప్రెసిడెంట్‌గా దాదా ఎంపికవ్వడం ఖాయం. 2019 నుంచి గంగూలీ సోదరుడు స్నేహశిష్ క్యాబ్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.
🚨 REPORTS 🚨
Sourav Ganguly is set to become the new President of the Cricket Association of Bengal. 🥇#Cricket #Bengal #Ganguly #BCCI pic.twitter.com/Tx8XafG98x
— Sportskeeda (@Sportskeeda) September 14, 2025
‘మరోసారి బీసీసీఐ అధ్యక్ష పదవి చేపడుతారా?’ అనే ప్రశ్నకు దాదా మీరు అనవసరంగా ఏవేవో ఊహించుకోండి అని బదులిచ్చాడు. దాంతో.. అతడు బీసీసీఐ బోర్డులో ఉండేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.2015 నుంచి 2019 వరకూ బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేసిన గంగూలీ.. మరోదఫా ఆ పదవి చేపట్టేందుకు సిద్ధంగా లేడు. ఇప్పటికే ఎస్ఏ20లో ప్రిటోరియా క్యాపిటల్స్ కోచ్‌గా అతడుఎంపికైన విషయం తెలిసిందే.
క్యాబ్ కొత్త కార్యవర్గం కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కానుంది. నితిశ్ రంజన్ దత్తా (ఉపాధ్యక్షుడు), బాబ్లు కొలే(కార్యదర్శి), మదన్ మోహన్ ఘోష్(సంయుక్త కార్యదర్శి), సంజయ్ దాస్ (కోశాధికారి)గా నామినేషన్ వేశారు. ఈ నలుగురు తప్ప ఇంకొకరు పోటీలో లేకపోవడంతో వీరంతా ఎన్నికైనట్టే.