Gautam Gambhir : భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ(MS Dhoni) వల్లే రోహిత్ శర్మ(Rohit Sharma) ఇంత గొప్ప ప్లేయర్‌గా ఎదిగాడని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir) అన్నాడు. కెరీర్ ఆరంభంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన రోహిత్ ఆ తర్వాత ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్‌గా ఎదిగాడని గంభీర్ వ్యాఖ్యానించాడు. ‘ప్రతిభను ప్రోత్సహించడంలో ధోనీ స్టైలే వేరు. కెరీర్ ఆరంభంలో ఎన్నో ఇబ్బందులు పడ్డ రోహిత్‌కు మహీ అండగా నిలిచాడు. అందుకే మనం ఇప్పుడు రోహిత్లో ఇంతటి విధ్వంసక వీరుడిని చూడగలుగుతున్నాం’ అని గౌతీ అభిప్రాయపడ్డాడు.
వన్డే క్రికెట్లో మరే ప్లేయర్‌కు సాధ్యం కాని రీతిలో మూడు డబుల్ సెంచరీ బాదిన రోహిత్‌ను ధోనీ ఎంతగానో ప్రోత్సహించాడని, దాని ఫలితంగానే భారత్‌కు గొప్ప ఓపెనర్ దక్కాడని గంభీర్ వెల్లడించాడు. 2007 టీ20 ప్రపంచ కప్‌లో ధోనీ సారథ్యంలోనే రోహిత్ ఆడాడు. అయితే.. మిడిలార్డర్ నుంచి ఓపెనర్‌గా ప్రమోషన్ పొందిన తర్వాత రోహిత్ భారీగా పరుగులు సాధించిన విషయం తెలిసిందే.
🚨 Milestone 🔓
1⃣0⃣0⃣0⃣0⃣ ODI runs & counting 🙌 🙌
Congratulations to #TeamIndia captain Rohit Sharma 👏 👏
Follow the match ▶️ https://t.co/P0ylBAiETu #AsiaCup2023 | #INDvSL pic.twitter.com/STcUx2sKBV
— BCCI (@BCCI) September 12, 2023
ఆసియాకప్ సూపర్-4లో భాగంగా శ్రీలంతో మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ అర్ధశతంకతో చెలరేగాడు. దాంతో వన్డే కెరీర్లో 10 వేల పరుగుల మైలురాయిని దాటాడు. అయితే తొలి 100 ఇన్నింగ్స్‌ల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన రోహిత్.. ఆ తర్వాత దంచికొడుతున్నాడు. వన్డే క్రికెట్లో హిట్‌మ్యాన్ తొలి 100 ఇన్నింగ్స్‌ల్లో 2,752 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత 141 ఇన్నింగ్స్‌ల్లో 7,248 రన్స్ చేసి పది వేల పరుగుల వీరుల జాబితాలో చేరాడు.