CSK vs RR : ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే గెలవక తప్పని పోరులో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) పంజా విసిరింది. లో స్కోర్ మ్యాచ్‌లో టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals)ను చిత్తుగా ఓడించింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా రుతురాజ్ గైక్వాడ్(42 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. కీలక ఆటగాళ్లు విఫలమైనా.. డారిల్ మిచెల్(22), రచిన్ రవీంద్ర(27) మెరుపులతో సీఎస్కే 5 వికెట్ల తేడాతో గెలిచి.. 14 పాయింట్లు సాధించింది.
చెపాక్‌లో రాజస్థాన్ నిర్దేశించిన స్వల్ప ఛేదనలో చెన్నై ఇన్నింగ్స్ ఆదిలో నత్తను తలపించింది. స్టార్ ఆటగాళ్లు రచిన్ రవీంద్ర(27) వెనుదిరిగాక వచ్చిన డారిల్ మిచెల్(22) అటాకింగ్ గేమ్ ఆడాడు. అయితే.. చాహల్ అతడిని ఎల్బీగా ఔట్ చేయగా.. 67 వద్ద సూపర్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. మోయిన్ అలీ(10), శివం దూబే(18), రవీంద్ర జడేజా(5) లు తక్కువ స్కోర్‌కే వెనుదిరిగినా.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఒంటరి పోరాటం చేశాడు.
The Rutu Charge! 🦁⚡️#CSKvRR #WhistlePodu 🦁💛
— Chennai Super Kings (@ChennaiIPL) May 12, 2024
ఆదుకుంటాడనుకున్న జడ్డూ రనౌట్ తప్పించుకునేందుకు వికెట్లకు అడ్డంగా పరుగెత్తి ఔటయ్యాడు. అక్కడితో చెన్నై అభిమానుల్లో ఉత్కంఠ. అయితే.. ఇంప్యాక్ట్ ప్లేయర్ సమీర్ రిజ్వీ(15 నాటౌట్) అండగా గైక్వాడ్ దంచాడు. బర్గర్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన గైక్వాడ్ చెన్నైని విజయానికి చేరువ చేశాడు. బౌల్ట్ వేసిన 19వ ఓవర్లో రిజ్వీ వరుసగా రెండు బౌండరీలు బాదడంతో చెన్నై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
Riyan Parag fought hard for his unbeaten 47
How crucial was his innings?
— IndianPremierLeague (@IPL) May 12, 2024
ప్లే ఆఫ్స్ రేసుకు అడుగు దూరంలో నిలిచిన రాజస్థాన్ రాయల్స్ కీలక పోరులో తడబడింది. టాప్ ఆటగాళ్లు యశస్వీ జైస్వాల్(24), జోస్ బట్లర్(21), కెప్టెన్ సంజూ శాంసన్()లు ఆడలేమంటూ చేతులెత్తేయగా.. రాజస్థాన్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. రియాన్ పరాగ్(47 నాటౌట్), ధ్రువ్ జురెల్(28)ల అద్భుతంగా పోరాడడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 141 రన్స్ కొట్టింది. సొంత మైదానంలో సిమర్జిత్ సింగ్(3/26), తుషార్ దేశ్‌పాండే(2/30)లు రాణించారు.