నెల్లికుదురు, సెప్టెంబర్ 24 : మహబూబాబాద్‌లో రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలు బుధవారం ముగిశాయి. 33 జిల్లాల నుంచి బాలబాలికలు వేర్వేరుగా మొత్తం 66 జట్లలో 792 మంది ప్లేయర్లు హాజరయ్యారు. బాలికల విభాగం ఫైనల్లో జోగులాంబ గద్వాల 30-21 తేడాతో యాద్రాద్రి భువనగిరిపై ఉత్కంఠ విజయం సాధించింది. భువనగిరి రన్నరప్‌గా నిలువగా, సిద్దిపేట మూడో స్థానంలో నిలిచింది.
మరోవైపు హోరాహోరీగా సాగిన బాలుర తుదిపోరులో సంగారెడ్డి 41-40తో జోగులాంబ గద్వాలపై గెలిచింది. ఆఖరి వరకు ఇరు జట్లు నువ్వానేనా అన్నట్లు తలపడ్డాయి. యాద్రాద్రి భువనగిరికి మూడో స్థానం దక్కింది. విజేతలకు షూటింగ్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మంగళపల్లి శ్రీనివాస్, జాతీయ ప్రధాన కార్యదర్శి జిత్రాజ్కుమార్..విజేతలకు ట్రోఫీలు అందజేశారు.