క్రికెట్లో ఫన్నీ సంఘటనలు చాలానే జరుగుతూ ఉంటాయి. రనౌట్లు, ఓవర్‌త్రోలు వీటిలో ముఖ్యంగా ఉంటాయి. ఇవి చూసేటప్పుడు ఆ ఆటగాళ్ల తత్తరపాటు చూసి నవ్వొచ్చేస్తుంది. తాజాగా యూరోపియన్ లీగ్ సిరీస్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. వినోహార్డీ సీసీ, ప్రేగ్ బార్బేరియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది.
వాతావరణం బాగలేకపోవడంతో మ్యాచ్‌ను మూడు ఓవర్లకు కుదించారు. ముందుగా ప్రేగ్ బార్బేరియన్స్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో బంతిని ముందుకొచ్చి బాదేందుకు ప్రయత్నించిన బ్యాటర్ మిస్ అయ్యాడు. అయితే అప్పటికే నాన్‌స్ట్రైకర్‌లో ఉన్న బ్యాటర్ అక్కడి వరకు వచ్చేశాడు. దాంతో బౌలర్‌కు బంతిని విసరడానికి ప్రయత్నించాడు.
అది మిస్ అవడంతో ఫీల్డర్ దాన్ని మళ్లీ కీపర్ వైపు విసిరాడు. మళ్లీ బంతి మిస్ అవడంతో బ్యాటర్లు మరో పరుగు తీసేశారు. దూరంగా వెళ్లిన బంతిని అందుకున్న ఫీల్డర్ మళ్లీ దాన్ని బౌలర్ వైపు విసరగా.. అక్కడ ఉన్న ఫీల్డర్ మిస్ అయ్యాడు. దాంతో మూడో పరుగు కూడా బ్యాటర్లు పూర్తిచేశారు. ఇలా ఒక్క పరుగు కూడా రాకూడని బంతికి మూడు పరుగులు చేశారు ప్రేగ్ బ్యాటర్లు.
ఈ తతంతం జరుగుతున్నంతసేపూ కామెంటేటర్లు నవ్వు ఆపుకోలేకపోయారు. ఈ వీడియోను యూరోపియన్ లీగ్ క్రికెట్.. ట్విట్టర్లో షేర్ చేసింది. దీనిపై నెటిజన్లు కూడా రకరకాలుగా స్పందిస్తూ నవ్వుకుంటున్నారు. మ్యాచ్ విషయానికొస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన ప్రేగ్ జట్టు 3 ఓవర్లు ముగిసే సరికి 24/2 స్కోరు చేయగా.. వినోహార్డీ జట్టు మూడు వికెట్ల నష్టానికి 18 పరుగులు మాత్రమే చేయగలిగింది.
They sneaked in 3️⃣ runs out of nowhere!!🤯😆 @CzechCricket#EuropeanCricketSeries #CricketInCzechRepublic pic.twitter.com/Ld3olDLeuT
— European Cricket (@EuropeanCricket) June 8, 2022