పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ అంటేనే ఎక్కడ లేని ఎనర్జీతో కదం తొక్కే మట్టికోర్టు మహావీరుడు రఫెల్ నాదల్, అతడి బాటలోనే వెళ్తున్న యువ సంచలనాలు కార్లోస్ అల్కారజ్, ఇగా స్వియాటెక్ (పోలండ్) ఒలింపిక్స్‌లో క్వార్టర్స్ చేరారు. ఫిలిప్పీ చార్టర్ వేదికగా బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో స్వియాటెక్ 6-2, 6-4తో వాంగ్ జియు (చైనా)ను చిత్తుచేసి క్వార్ట ర్స్ చేరింది. 1988 సియోల్ ఒలింపిక్స్‌లో స్వియాటెక్ తండ్రి థామస్ స్వియాటెక్ సైతం క్వార్టర్స్ చేరడం విశేషం. ఇక పురుషుల డబుల్స్‌లో అల్కారజ్-నాదల్ (స్పెయిన్) ద్వయం 6-4, 6-7(2), 10-2తో గ్రీక్స్పర్-కూల్‌హాఫ్ (నెదర్లాండ్స్)ను ఓడించి క్వార్టర్స్ చేరా రు. కొద్ది రోజుల క్రితమే ముగిసిన ఫ్రెం చ్ ఓపెన్‌లో అల్కారజ్, స్వియాటెక్ విజేతలుగా నిలిచిన విషయం విదితమే.