హాంబర్గ్ : ఫ్రీస్టయిల్ గ్రాండ్‌స్లామ్ టూర్లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్.. అమెరికా ఆటగాడు ఫాబియానో కరువానాతో జరిగిన తొలి క్వార్టర్స్‌లో ఓటమిపాలయ్యాడు. 40 ఎత్తుల్లో ముగిసిన ఈ పోరులో కరువానాదే పైచేయి అయింది. ఆట ఆరంభంలోనే ఆధిక్యం సాధించినప్పటికీ గుకేశ్ దానిని చివరిదాకా నిలుపుకోలేకపోయాడు. సోమవారం ఈ ఇద్దరి మధ్య రెండో క్వార్టర్స్ మ్యాచ్ జరుగుతుంది.