డస్సెల్‌డార్ఫ్: ప్రతిష్టాత్మక యూరో కప్‌లో టైటిల్ ఫెవరేట్‌గా బరిలోకి దిగిన ఫ్రాన్స్ బోణీ కొట్టింది. డస్సెల్‌డార్ఫ్ (జర్మనీ) వేదికగా జరిగిన మ్యాచ్‌లో 1-0తో ఆస్ట్రియాను ఓడించింది. ఫ్రాన్స్ తరఫున 38వ నిమిషంలో మ్యాక్స్మిలిన్ ఓబర్ ఏకైక గోల్ చేశాడు.
ఆస్ట్రియా పలుమార్లు గోల్‌పోస్ట్‌కు దగ్గరగా వచ్చినా ఫ్రాన్స్ దానిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ సూపర్ స్టార్ కిలియన్ ఎంబాపె ముక్కుకు గాయమవడంతో అతడు పలు మ్యాచ్‌ల దూరమయ్యే అవకాశమున్నట్టు సమాచారం.