సౌథాంప్టన్: ఊహించినట్లే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ నాలుగో రోజు ఆటకు వరుణుడు అడ్డుపడుతున్నాడు. సోమవారం ఉదయం నుంచి సౌథాంప్టన్‌లో వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ఎజియస్ బౌల్ స్టేడియం మొత్తం కవర్లతో కప్పి ఉంచారు. నాలుగో రోజు ఆట ప్రారంభం కావడానికి చాలా సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం.. సోమవారం రోజంతా వర్షం పడే అవకాశం ఉండటంతో ఆట సజావుగా సాగడం అనుమానమే.
It continues to drizzle and we have to state the obvious.
— BCCI (@BCCI) June 21, 2021
Start of play on Day 4 has been delayed. ☔⌛#WTC21