గ్రేటర్ నోయిడా: ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్(AFG Vs NZ) మధ్య ఢిల్లీలోని గ్రేటర్ నోయిడాలో జరగాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్‌కు వరుణుడు అడ్డుగా నిలిచాడు. ఇవాళ నాలుగవ రోజు కూడా మ్యాచ్‌ను రద్దు చేశారు. వర్షం వల్ల పిచ్ చిత్తడిగా మారడంతో.. ఆటను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. నాలుగు రోజులు కూడా ఒక్క బంతిని బౌల్ చేయలేదు. కనీసం మ్యాచ్‌కు చెందిన టాస్ కూడా పడలేదు. నిరంతరాయంగా వర్షం కురుస్తున్న కారణంగా కివీస్‌తో జరగాల్సిన టెస్టు మ్యాచ్ నాలుగవ రోజును రద్దు చేసినట్లు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అయితే అయిదో రోజు ఉదయం 8 గంటలకు టాస్ వేయనున్నట్లు చెప్పారు.
టెస్టు క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు మాత్రమే ఒక్క బంతి కూడా పడకుండా రద్దు అయ్యాయి. 1998లో కివీస్, ఇండియా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ అలాగే ముగిసింది. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా కివీస్, ఆఫ్ఘన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత కివీస్ జట్టు శ్రీలంక టూర్‌కు వెళ్తుంది. ఆ తర్వాత అక్టోబర్‌లో ఇండియాతో మూడు టెస్టులు ఆడుతుంది.
4th day is already called off!#AFGvNZ pic.twitter.com/uSC75ePtRA
— Daya sagar (@sagarqinare) September 12, 2024