హైదరాబాద్, ఆట ప్రతినిధి: జర్మనీ వేదికగా జూన్ 1 నుంచి 6 తేదీ వరకు జరిగే ప్రతిష్ఠాత్మక ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచకప్ టోర్నీకి నలుగురు తెలంగాణ షూటర్లు భారత జట్టుకు ఎంపికయ్యారు. ఇందులో మన రాష్ట్రం నుంచి మేఘన సాదుల(25మీ పిస్టల్), ధనుశ్(10మీ రైఫిల్), మునిక్(స్కీట్), జెహ్రా దేసావాలా(స్కీట్) ఉన్నారు.
మహిళల జూనియర్ 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో పాయల్, సిమ్రన్ప్రీత్కౌర్తో కలిసి మేఘన బరిలోకి దిగుతున్నది. ప్రపంచకప్ ముగిసిన తర్వాత జూలైలో చాంగ్వాన్లో వరల్డ్ జూనియర్ ప్రపంచ చాంపియన్షిప్ జరుగనుంది.