Boxing | అస్తానా: ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నీలో నలుగురు భారత పురుష బాక్సర్ల పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన వేర్వేరు కేటగిరీల సెమీస్ బౌట్లలో.. గౌరవ్ చౌహాన్ (92 కిలోలు), యిఫాబా సింగ్ (48 కిలోలు), అభిషేక్ (67 కిలోలు), విశాల్ (86 కిలోలు) చతికిలపడ్డారు.
ఈ నలుగురూ కజకిస్థాన్ బాక్సర్ల చేతిలో ఓడి కాంస్యాలతో సరిపెట్టుకున్నారు. మహిళల విభాగంలో ఫైనల్ చేరిన నిఖత్ జరీన్, మీనాక్షి, అనామిక, మనీషా శనివారం స్వర్ణం కోసం బరిలోకి దిగనున్నారు.