ఢిల్లీ: సమోవాలో జరుగుతున్న కామన్వెల్త్ యూత్ అండ్ జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత యువ వెయిట్‌లిఫ్టర్లు సత్తాచాటారు. రెండో రోజు పోటీల్లో భాగంగా దేశానికి నాలుగు పసిడి పతకాలు అందించారు. పురుషుల 65 కిలోల విభాగంలో సునీల్ సింగ్ 271 కిలోల బరువు (126 కి. స్నాచ్, 145 కి. క్లీన్ అండ్ జెర్క్) ఎత్తి పసిడి నెగ్గగా మహిళల 58 కి. క్యాటగిరీలో ఐసంగ గొగొయ్ 185 కి. (79 కి. స్నాచ్, 106 కి. క్లీన్ అండ్ జెర్క్)తో స్వర్ణం గెలిచింది.