హరారే: కట్టుకున్న భార్యపై హత్యాయత్నానికి పాల్పడ్డందుకు గాను జింబాబ్వే మాజీ క్రికెటర్ తరిసాయ్ మసకందను పోలీసులు అరెస్టు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. రెండ్రోజుల క్రితం మసకంద భార్య టినో డివనషె మకునికెపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. డబ్బుల వ్యవహారంలో తలెత్తిన ఓ గొడవలో ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో అతడు వంటగదిలో ఉండే కత్తితో ఆమెపై దాడికి దిగాడు. ఈ ఘటనలో ఆమె చేతులు, వీపు భాగంలో తీవ్ర గాయాలైనట్టు స్థానిక పోలీసులు తెలిపారు. మసకంద జింబాబ్వే తరఫున 5 టెస్టులు, 16 వన్డేలు, 12 టీ20లు ఆడాడు.