న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వినీత్ శరణ్ బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్గా నియమితులయ్యారు. ఏడాది కాలంగా ఖాళీగా ఉన్న ఈ పదవితో పాటు అంబుడ్స్మన్ బాధ్యతలను కూడా జస్టిస్ వినీత్ చేపట్టనున్నారు. గత ఏడాది జస్టిస్ డీకే జైన్ తప్పుకోగా.. తాజాగా జస్టిస్ వినీత్ ఆ పదవి అధిరోహించనున్నారు. మరోవైపు ఐపీఎల్ మీడియా హక్కులు రికార్డు స్థాయిలో అమ్ముడుపోగా.. ఇక దేశవాళీ మీడియా హక్కుల విషయంపై బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ దృష్టి సారించింది.