హైదరాబాద్, ఆట ప్రతినిధి: దేశవాళీ క్రికెట్లో సత్తాచాటుతున్న తెలంగాణ ప్లేయర్లపై సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) చిన్నచూపు చూస్తున్నదని టీడీసీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశాడు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని ఎస్ఆర్హెచ్ కార్యాలయం ముందు విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి వెంకటేశ్వర్‌రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఐపీఎల్ వేలంలో పోటీపడేందుకు తెలంగాణ నుంచి దాదాపు 100 మంది ప్లేయర్లు పేర్లు నమోదు చేసుకుంటే ఎస్ఆర్హెచ్ కనీసం ఒక్క ప్లేయర్‌ను ఎంపిక చేయకపోవడం అన్యాయం. అమన్‌రావు, ఆరోన్జార్జ్ లాంటి ప్లేయర్లను ఎస్ఆర్హెచ్ ఎందుకు కొనుగోలు చేయలేదు. ఎస్ఆర్హెచ్కు ఇక్కడి మౌలిక వసతులు, డబ్బులు కావాలి. కానీ స్థానిక ప్లేయర్లకు అవకాశాలు ఇవ్వరా’ అని అంటూ ప్రశ్నించారు. అనంతరం ఎస్ఆర్హెచ్ ప్రతినిధి నగేశ్‌కు వినతిపత్రం అందజేశారు.