లాహోర్ : పాకిస్థాన్ మాజీ అంపైర్ అసద్ రవూఫ్(66) గుండెపోటుతో బుధవారం రాత్రి మరణించారు. మేటి అంతర్జాతీయ అంపైర్లలో ఒకడిగా పేరుగాంచిన రవూఫ్ 2000నుంచి అంతర్జాతీయ మ్యాచ్‌లలో విధులు నిర్వహించారు. రవూఫ్ 64 టెస్టులు, 139 వన్డేలు, 28 టి20లలో అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. అంతేగాక 11 మహిళా టి20 మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించారు. రవూఫ్ మృతిపట్ల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పలువురు ప్రముఖ క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేశారు. అయితే 2016లో స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకున్న రవూఫ్ ఆ తరువాత అంతర్జాతీయ అంపైర్ ప్యానల్నుంచి తొలగించారు.