కరాచీ:పాకిస్థాన్ తాత్కాలిక చీఫ్ సెలెక్టర్‌గా మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ ఎంపికయ్యాడు. నజామ్ సేథీ నేతృత్వంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) సెలెక్షన్ కమిటీని ఏర్పాటు చేస్తూ శనివారం నిర్ణయం తీసుకుంది.
కివీస్‌తో జరుగనున్న రెండు టెస్టులు, మూడు వన్డేల కోసం జట్లను ఎంపిక చేయనుంది. కమిటీలో అఫ్రిదీతో పాటు అబ్దుల్ రజాక్, రావ్ ఇఫ్తికార్ , రషీద్ సభ్యులుగా ఉన్నారు.