తిరువనంతపురం: భారత మాజీ పేసర్ ఎస్ శ్రీశాంత్‌పై కేరళ క్రికెట్ అసోసియేషన్ (కేసీఏ) మూడేండ్ల సస్పెన్షన్ విధించింది. ప్రస్తుతం భారత జట్టు సభ్యుడైన సంజూ శాంసన్‌కు మద్దతుగా నిలిచే క్రమంలో కేసీఏపై శ్రీశాంత్ చేసిన వ్యాఖ్యలే అతడిపై వేటుకు కారణమయ్యాయి.
ఓ టెలివిజన్ చానెల్లో శ్రీశాంత్ మాట్లాడుతూ.. ఈ ఏడాది జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొన్న కేరళ జట్టులో కేసీఏ.. శాంసన్‌కు చోటు కల్పించలేదని ఆరోపించాడు.