భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా తండ్రి త్రిలోక్‌చంద్ రైనా కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. క్యాన్సర్‌తో పోరాడుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. త్రిలోక్‌చంద్ మిలిటరీలో పనిచేశారు. మిలిటరీలో పనిచేసినప్పుడు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో బాంబుల తయారీలో ఆయన తనదైన ముద్ర వేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఉన్న తన ఇంట్లో ఆయన తుదిశ్వాస విడిచినట్టు సురేశ్ రైనా ప్రకటించారు.
జమ్ముకశ్మీర్‌లోని రైనావారి.. ఆయన సొంత ఊరు. 1990లో త్రిలోక్‌చంద్ ఆ ఊరిని వదిలి మురాద్‌నగర్ టౌన్లో స్థిరపడ్డారు. త్రిలోక్చంద్కు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. వాళ్లలో సురేశ్ రైనా చిన్నకొడుకు. మరోవైపు సురేశ్ రైనా.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి 2020లో తప్పుకున్న విషయం తెలిసిందే.